థియేటర్లో ఈ వారం చిన్న చిత్రాలదే హవా

-

బాక్సాఫీస్‌ వద్ద టిల్లుగాడి దండయాత్ర కొనసాగుతోంది. ఇక తాజాగా వచ్చిన విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ అంతగా ప్రభావం చూపలేకపోతోంది. ఇక ఈ వారం వేసవి బాక్సాఫీస్ వద్ద వినోదాల విందు పంచేందుకు సరికొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వారం కూడా స్టార్ హీరోల సినిమాలేం లేవు. ఈ వీక్ కూడా థియేటర్లలో చిన్న చిత్రాల జోరే కొనసాగనుంది. మరి ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దామా?

ఈ వారం థియేటర్లలో సందడి చేసే సినిమాలు ఇవే

మైదాన్ : బాలీవుడ్ హీరో అజయ్ దేవగణఅ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మైదాన్. అజయ్‌, ప్రియమణి జంటగా అమిత్‌ శర్మ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

బడేమియా ఛోటేమియా : బాలీవుడ్‌ కథానాయకులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌, మానుషి చిల్లర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 10న ఈ మూవీని థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు

గీతాంజలి మళ్లీ వచ్చింది – ఏప్రిల్ 11

లవ్‌ గురు – ఏప్రిల్ 11

డియర్‌ – ఏప్రిల్ 12

Read more RELATED
Recommended to you

Latest news