టెక్నాలజీ కోసం చైనా జపాన్ దేశాల మీద ఆధారపడే భారత్ నేడు మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచంలో రెండవ స్థానానికి ఎదిగిందని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. అమెరికా వంటి సంపన్న దేశాలలో పూర్తిస్థాయిలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి పదేళ్ల కాలం పట్టిందని నిరక్షరాస్యత అధికారం గా ఉన్న మన దేశంలో కేవలం మూడేళ్లలో డిజిటల్ వినియోగం మెరుగుపడిందని అన్నారు.
సోమవారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ మారేడ్పల్లిలో ఈటల అల్పాహార విందులో పాల్గొన్నారు. ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో బయటకు వెళ్తే ఇంటికి తిరిగి వస్తామా అని అనుకునేవారని మోడీ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా నిద్రపోతుందని ఈటల అన్నారు.