అది నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.. వైఎస్ జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌..

-

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ఉల్లి ధరలపై పెద్ద చర్చే జరిగింది. ఈ చర్చ కాస్త టీడీపీ అధినేత చంద్రబాబు వర్సెస్ మంత్రి కొడాలి నానిగా మారింది. ఇదిలా ఉంటే.. వైఎస్ జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్ విసిరారు. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. హెరిటేజ్ ఫ్రెష్ మాదికాదని.. అమ్మేశామని ఇదివరకే చెప్పామని చంద్రబాబు అన్నారు. అయినా హెరిటేజ్ మాదే అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సంస్థ మాదే అని రుజువు చేస్తే… తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబు సవాల్ చేశారు. అలా రుజువు చేయలేకపోతే సీఎం జగన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని ప్రశ్నించారు. తాను చేసిన సవాల్‌ను ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు స్వీకరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదే పదే ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలను హెచ్చ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news