జూన్ 2 నుంచి 29 వరకూ అమెరికా, వెస్ట్ ఇండీస్ వేదికగా జరగబోయే T20 వరల్డ్ కప్ 2024 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే జూన్ లో జరగబోయే T20 ప్రపంచకప్ లో సంజూ శాంసన్, పంత్ ఇద్దరూ టీమ్ ఇండియాలో ఉండాలని వెస్టిండీస్ దిగ్గజం లారా అభిప్రాయం వ్యక్తం చేశారు. కీపింగ్ కి టీమిండియా లో పోటీ ఎక్కువ ఉన్న కారణంగా ఒకరినే ఎంపిక చేయాలా అన్న ప్రశ్నపై స్పందించారు. ‘వాళ్లిద్దరిలో ఒకరిని కాదు. ఇద్దర్నీ ఇండియా సెలక్టర్లు జట్టులోకి తీసుకోవాలి. ఈ సీజన్లో వారు అద్భుతంగా ఆడుతున్నారు. శాంసన్ టైమింగ్, పంత్ ఫామ్ రెండూ బాగున్నాయి’ అని లారా తెలిపారు.
కాగా, ఈ ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది.గ్రూప్-ఎలో భారత్, ఐర్లాండ్,పాకిస్థాన్, అమెరికా, కెనడా ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా,స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్,వెస్టిండీస్, ఆప్ఘనిస్తాన్, పపువా న్యూగినియా,ఉగాండ ఉన్నాయి. గ్రూప్-డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ ,బంగ్లాదేశ్ ఉన్నాయి