లోక్సభ తొలి విడత ఎన్నికల బరిలో 135 మంది మహిళలు

-

లోక్సభ ఎన్నికల సమరంలో తొలి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌- ADR ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశానికి ప్రాతినిథ్యం వహించే విషయంలో మహిళల సంఖ్య మరోసారి తెరపైకి వచ్చింది. మొదటి దశ ఎన్నికల్లో మొత్తం 1618 మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 135 (8%) మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారని ఏడీఆర్ తెలిపింది. అంతేకాదు బరిలో దిగిన 1618 మందిలో 256 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ప్రకటించింది.

ADR నివేదిక ప్రకారం లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో బరిలో నిలిచిన మొత్తం 1618 మందిలో 28 మంది నిరక్షరాస్యులు, 255 మంది గ్రాడ్యుయేట్లు, 309 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 47 మంది డాక్టరేట్లు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. 466 మంది అభ్యర్థులు 41-50 మధ్య వయస్సు ఉన్న వారు కాగా 388 మంది 31-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నట్లు పేర్కొంది. 51-60 వయసు మధ్య 383 మంది, 61-70 ఏళ్ల మధ్య 117 మంది, 25-30 వయసు మధ్య 210 మంది అభ్యర్థులు ఉన్నారని, 71-80 ఏళ్ల మధ్య 50 మంది అభ్యర్థులు ఉండగా 81 నుంచి 90 ఏళ్ల మధ్య నలుగురు ఉన్నారని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news