ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్‌ను ఢీకొన్న కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సాహిల్ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సాహిల్ కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.
జూబ్లీహిల్స్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో సాహిల్ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ప్రజాభవన్తో పాటు ఈ కేసులోనూ సాహిల్ను విచారించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు సాహిల్‌కు బెయిల్ ఇవ్వాలంటూ అతడి తరఫు న్యాయవాది కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
గతేడాది డిసెంబర్‌లో సాహిల్ నిర్లక్ష్యంగా కారు నడిపి అతివేగంతో ప్రజాభవన్ వద్ద బారికేడ్లను ఢీ కొట్టాడని, అతడు పారిపోయి వేరే డ్రైవర్ ప్రమాదం చేసినట్లు చిత్రీకరించాడని పోలీసులు వెల్లడించారు. సాహిల్‌పై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.