నువ్వు సీఎంవా.. చెడ్డి గ్యాంగ్ లీడర్ వా రేవంత్ రెడ్డి..? – హరీష్‌ రావు

-

నువ్వు సీఎంవా.. చెడ్డి గ్యాంగ్ లీడర్ వా రేవంత్ రెడ్డి..? అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఉడదీస్తా అంటాడు…నువ్వు సీఎంవా చెడ్డి గ్యాంగ్ లీడర్ వా రేవంత్ రెడ్డి..? అంటూ నిలదీశారు. ఎలక్షన్స్ ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నోసిటితో వెక్కిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగు లాగా ఉందని…ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.

harish rao vs revanth

కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందని.. ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకురాని హస్తం లాగా తయారయ్యింది…2004 నుంచి 2019 వరకు మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురుతూనే ఉందన్నారు. ఈ సారి కూడా మెదక్ గడ్డపై BRS జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news