చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని చురకలు అంటించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. వాలంటీర్లు పై చంద్రబాబు తీసుకున్న యూటర్న్ చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది…..భీమిలి రాజధాని కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ది జరుగుతుందని వివరించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.
చంద్రబాబు పొరపాటున అధికారంలోకి వస్తే రాజధాని అమరావతికి తరలించుకుపోతారని హెచ్చరించారు. ఎలక్షన్ లలో రావడం….గెలిచాక ముఖం చాటేయడం గంటా శ్రీనివాస్ కు అలవాటు అయిపోయిందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఐదేళ్లకు ఒకసారి వచ్చి మాయ మాటల తో ఓట్లు చేయించుకోవడానికి వస్తున్నాడు….నార్త్ లో పోటీ చేస్తే డిపాజిట్లు రావని తెలిసి భీమిలి కి మారాడని గంటాపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్.