Manchu Manoj :తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో

-

టాలీవుడ్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు మంచు మనోజ్. తాజాగా హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి వెల్లడించారు. మంచు మనోజ్, భూమా మౌనిక ఆడబిడ్డ కు జన్మనివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది.. తన అన్న ధైర్వవ్ ఆనందానికి అవధుల్లేవు… చిన్నారిని మేము ప్రేమగా ఎంఎం పులి అని పిలుస్తాం అని మంచు లక్ష్మీ తెలిపారు.

Manchu Manoj and Bhuma Mounika are Blessed with a Baby Girl

ఆ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అని మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి ప్రకటన తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా మంచు మనోజ్ మరియు భూమా మౌనిక ఇద్దరు రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చిలో వీరిద్దరి వివాహం జరిగింది. కాగా ఇప్పటికే భూమా మౌనికకు ఒక కొడుకు ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news