ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిని పలువురు ఖండిస్తుంటే మరికొందరు మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే చేయించుకున్న దాడి అని మరికొందరు ఆరోపిస్తున్నారు. తాజాగా జగన్పై దాడి వ్యవహారంపై ప్రశాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. గత ఎన్నికల ముందు జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన కోడి కత్తి దాడి విషయంలో అందరూ ముందు దాడి అన్నారని, ఆ తర్వాత డ్రామా అన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం జరిగిన దాడి కూడా నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటనను విలేఖర్లు ప్రస్తావించగా తాను సీబీఐ అధికారిని కాదని, నిజంగా దాడి జరిగిందా లేకుంటే ఓట్ల సానుభూతి కోసం కావాలని దాడి చేయిస్తే అది మోసం అన్నారు. ముందుగా జరగాల్సిన ఎన్నికలను కావాలనే చివరి షెడ్యూల్‌కు మార్చారని పేర్కొన్నారు. తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని కేఏ పాల్ తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేసే విషయం ఆలోచిస్తానని వెల్లడించారు.