ప్రధాని నరేంద్ర మోదీ పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోల్చుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారన్న పవార్.. అచ్చం అలాగే మోదీ ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షంలో ఎవరూ ఎన్నికవ్వాలని ఆయన కోరుకోవడం లేదని, ఇద్దరి తీరు ఒకేలా ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగానే.. ఒక ముఖ్యమంత్రి (సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ)ని అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నారన్న పవార్.. ఈ చర్య నిరంకుశత్వం వైపు దేశాన్ని మళ్లించడమే అవుతుందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన శరద్ పవార్.. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలా ప్రతిపక్షం కూడా ముఖ్యమేనని అన్నారు. బీజేపీ మేనిఫెస్టోపై వ్యాఖ్యానించడం ఇది సరైన సమయం కాదని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.