తేజ సజ్జా న్యూ మూవీ.. 18న టైటిల్ గ్లింప్స్ విడుదల

-

ఇటీవల హను మాన్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు యువ నటుడు తేజ సజ్జా. ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించారు.  తాజాగా ఈగిల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా రూపొందనున్న మూవీ  అనౌన్స్ మెంట్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి 36వ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ తో పాటు గ్లింప్స్ ని ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. గౌర హరి సంగీతం అందించనున్న ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించనుండగా మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని వివరాలు ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన తేజా సజ్జ సూపర్ యోధ అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news