గుడివాడతో సంబంధం లేని వ్యక్తిని తనపై పోటీకి నిలబెట్టారని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఓటుకు రూ.5వేలు ఇస్తే.. ప్రజలు ఓటు వేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. గుడివాడలో మాకు ఓటు బ్యాంకు ఉంది. మమ్మల్ని ఎవ్వరూ ఏం పీకలేరు. నా గెలుపు కోసం వేల మంది పని చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చినా.. అంతరిక్షం నుంచి వచ్చినా నన్ను ఓడించలేరు’ అని నాని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి విరుచుకుపడ్డారు కొడాలి నాని. ఎన్టీఆర్ ఫ్యామిలీని నారా లోకేష్ తిట్టాడని.. తన ఫ్యామిలీని కూడా తిట్టాడని పేర్కొన్నారు. ఎవ్వరూ ఎవ్వరినీ తిట్టినా కానీ ప్రజలు టీడీపీని నమ్మరు అన్నారు. చంద్రబాబు నాయుడు మోసగాడు అని.. తాను గుడివాడలో గెలిచేది గెలవనిది ప్రజల మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. టీడీపీ నేతలు వైసీపీ పై ఎన్ని విమర్శలు చేసినా.. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని, సీఎం జగన్ విశాఖలో ప్రమాణం చేస్తారని తెలిపారు కొడాలి నాని.