రాబోయో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి : ఇండియన్ మాజీ క్రికెటర్

-

నిన్నటి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. అనంతరం లక్ష చేదనలో బ్యాటింగ్ దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 262 పరుగులు చేసింది.అయితే ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు దుమ్ములేపినప్పటికి .. బౌలర్లు మాత్రం మరోసారి చేతులెత్తేశారు.గల్లీ బౌలర్ల కంటే దారుణంగా ఆర్సీబీ బౌలర్లు బౌలింగ్ చేశారుఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లపై భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శల వర్షం కురిపించాడు.

“ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు దారుణమైన ప్రదర్శన కనబరిచారు. రీస్ టాప్లీ, లాకీ ఫెర్గూసన్ వంటి సీనియర్‌ బౌలర్లు కూడా పూర్తిగా తేలిపోయారు అని అసహనం వ్యక్తం చేశారు. నిన్నటి మ్యాచ్‌లో విల్ జాక్స్ మినహా మిగితా బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు అని అన్నారు. ఆర్సీబీకి నేను ఇచ్చే సలహా ఒక్కటే.రాబోయో మ్యాచ్‌ల్లో ఆర్సీబీ 11 మంది బ్యాటర్లతో ఆడాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్‌ రెండు ఓవర్లు, ఆల్‌రౌండర్‌ కామెరాన్ గ్రీన్‌ 4 ఓవర్లు బౌలింగ్‌ చేయాలి. అదే విధంగా విరాట్‌ కోహ్లి కూడా బౌలింగ్‌ చేయాలి. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లి 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఉంటే అన్ని పరుగులు ఇచ్చేవాడు కాదు అని తెలిపారు..

 

Read more RELATED
Recommended to you

Latest news