ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ బరిలో పొంగులేటి ?

-

ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ బరిలో పొంగులేటి సీన్‌ లోకి వచ్చారు. అయితే.. పొంగులేటి అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదండొయ్‌.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు అన్న మాట. ఖమ్మం కాంగ్రెస్ బరిలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఉన్నారని సమాచారం. తన తమ్ముడికి టికెట్ ఇప్పించడంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…తన పంతాన్ని నెగ్గించుకున్నారట.

ఇక ఖమ్మం ఎంపీ టికెట్ ఖాయమవడంతో ప్రచారం షురూ చేశారట. ఇందులో భాగంగానే.. నిన్న కబడ్డీ పోటీలను తిలకించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బ్రదర్స్. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండలం, జీళ్ల చెరువులో పొంగులేటి యువసేన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్ జిల్లాల స్థాయి కబడ్డీ ముగింపు పోటీలకు హాజరయ్యారు మంత్రి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రసాద్ రెడ్డి బ్రదర్స్. ఇక రెండు రోజుల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్‌ ను ప్రకటించనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news