BREAKING : జువెనైల్ హోం నుంచి తప్పించుకున్న 8 మంది పిల్లలు

-

హైదరాబాద్లో జువెనైల్ హోం నుంచి 8 మంది పిల్లలు తప్పించుకున్నారు. సూరారం పరిధి కైసర్‌ నగర్‌లోని జువెనైల్ హోం నుంచి వీరంతా ఎస్కేప్ అయ్యారు. గమనించిన సిబ్బంది పిల్లల కోసం చుట్టుపక్కల అంతా గాలించారు. ఎంతకీ ఆచూకీ దొరకకపోవడంతో సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలు తప్పించుకున్నారా..? లేక ఇంకేదైనా జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ వారంతా పక్కా ప్లాన్ వేసి తప్పించుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news