Gold rates: బంగారం కొనుగోలు చేసేవారికి ఇవాళ అదిరిపోయే శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మహానగరంలో బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి.
హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం అలాగే వెండి ధరల వివరాల ప్రకారం…. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి… 74, 120 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 67, 940 రూపాయలుగా నమోదు అయింది. అలాగే వెండి ధర ₹100 తగ్గి… 86, 400 రూపాయలుగా నమోదు అయింది.