రాహుల్ గాంధీ మరోసారి బిజెపి మీద ఘాటు విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకి ఒకే చరిత్ర ఒకే భాషని రుద్దాలని చూస్తోందని అన్నారు. దీన్నే కాంగ్రెస్ రక్షిస్తోందని రాహుల్ గాంధీ చెప్పారు. గురువారం కేరళలోని కానూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఈడీసీబీఐని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించడం ద్వారా బిజెపి మన దేశ స్వరూపాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ యుడిఎఫ్ లు భారతదేశ వైవిధ్యాన్ని అంగీకరిస్తున్నాయి. మన ప్రజల భిన్న భాషలు సంప్రదాయాలు భిన్న చరిత్రనే అంగీకరిస్తాం బిజెపి ఒక చరిత్ర ఒక దేశం ఒకే భాషని రుద్దాలని చూస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.