IPL 2024: IPL 2024 టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. IPL టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు.
ఈ సందర్భంగా యువకుల నుంచి సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు మ్యాచ్ 15 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు సైబరాబాద్ SOT పోలీసులు. ఒక్కో టికెట్ ను బ్లాక్ లో 10 నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు యువకులు. మధుబాబు, మాథ్యూ రోడ్రిక్స్, నిజంతన్ ఎలంగోవన్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టు ముందు హాజరపరుచనున్నారు.
వివరాలు
1). సొంతూరి మధుబాబు S/o ఉమామహేశ్వర్, Age 30, Occ. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్, R/o. ఇస్నాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి.
2) మాథ్యూ రోడ్రిక్స్ S/o నోవా శ్రీ కుమార్, వయస్సు: 25, Occ: సాఫ్ట్‌వేర్. R/o.డిఫెన్స్ కాలనీ, సైనిక్‌పురి.
3) నిజంతన్ ఎలంగోవన్ Age 26, Occ సాఫ్ట్‌వేర్, R/o వేద శ్రీ మెన్స్ హాస్టల్, అంజయ్య నగర్, కొండాపూర్.
సీజర్ వివరాలు:-
1) మొబైల్ ఫోన్లు – 03.
2). మొత్తం టిక్కెట్లు – 15 (ఒక్కో టికెట్ రూ. 10,000/- నుండి 15,000/- వరకు అమ్ముడవుతోంది.)
మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు