డిప్యూటీ సీఎం భట్టికి కరెంట్ సెగ.. 20 నిమిషాలు చీకట్లోనే

-

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యానే విమర్శలున్నాయి. అయితే ఈ విమర్శలను మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొట్టివేస్తూ వచ్చింది. ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యుత్ విషంలో బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెబుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని కూడా అన్నారు. అయితే ఇవాళ స్వయంగా ఆయనకే కరెంట్ సెగ తగిలింది. భట్టి విక్రమార్క పాల్గొన్న ఓ మీటింగ్‌లో కరెంటు పోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు ఆయన చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..?

సీపీఐ నేతలతో డిప్యూటీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భట్టి విక్రమార్క ఈరోజు భేటీ అయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఆ ప్రాంతంలో కరెంటు పోగా..  కాసేపటికే ఆ ప్రాంతంలో కరెంటు వచ్చింది కానీ.. సీపీఐ కార్యాలయంలో మాత్రం పవర్‌ రాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు భట్టి విక్రమార్క చీకట్లోనే గడపాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news