సినిమా ఇండస్ట్రీలో నటులు ఒక్కొక్కరిగా వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు. హీరోలు, హీరోయిన్లు తమ జీవిత భాగస్వాములను ఎంచుకుంటున్నారు. తాజాగా మరో టాలీవుడ్ యంగ్ హీరో ఓ ఇంటివాడయ్యాడు. ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్ వివాహ బంధంలో అడుగుపెట్టాడు.
కల్పనా రావు అనే యువతిని తిరువీర్ వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వారివురు మూడు ముళ్ల బంధంతో ఆదివారం రోజున ఒక్కటయ్యారు. ‘కొత్త ఆరంభం..’ అంటూ హల్దీ వేడుక, పెళ్లి ఫొటోలను తిరువీర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన తిరువీర్ 150కిపైగా ప్రదర్శనలిచ్చారు. అనంతరం ‘బొమ్మల రామారం’లోని చిన్న పాత్రతో తెరంగేట్రం చేసి.. తర్వాత ‘ఘాజీ’, ‘ఏమంత్రం వేశావే’, ‘మల్లేశం’లోనూ నిడివి తక్కువ పాత్రలకే పరిమితమయ్యారు. ‘జార్జ్‌రెడ్డి’లో నెగెటివ్ రోల్, ‘పలాస 1978’లో సపోర్టింగ్ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మసూద’తో క్రేజ్‌ను పెంచుకున్నారు. ఇటీవల హీరోగా సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రకటించారు.