ఎన్నికల బందోబస్తుకు రాష్ట్రానికి 160 కంపెనీల కేంద్ర బలగాలు

-

లోక్‌సభ ఎన్నికల్లో ఓవైపు రాజకీయ పార్టీలు ప్రచారంలో బీజీగా ఉంటే.. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో బందోబస్తుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఏపీఎఫ్‌) దళాలను మోహరించేందుకు రంగం సిద్ధం చేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న సుమారు 60 వేల మంది స్థానిక పోలీసులకు తోడు 150-160 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలు విధుల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అస్సాం రైఫిల్స్‌(ఏఆర్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్పీఎఫ్‌), సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ), ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) బలగాలతో కూడిన ఒక్కో కంపెనీలో 70-80 మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. కేంద్రం నుంచి సుమారు 60 కంపెనీల బలగాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి.  మరో 100 కంపెనీలను పంపించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లేఖ రాసింది. మే నెల మొదటి వారంలో వచ్చే కేంద్ర బలగాల్లో ఎక్కువ మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news