నేడే ఏపీ పదో తరగతి ఫలితాలు

-

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో  పరీక్షలు జరిగాయి. మొత్తంగా 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది రాశారు.

పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతో పూర్తి చేశారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను ముగించారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయగానే ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన వెంటనే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు స్వయంగా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్ధుల హాల్‌ టికెట్‌ నెంబర్‌ను పొందుపరిచి https://Results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చూసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news