పంజాబ్ తో పోరులో గుజరాత్ విజయం

-

చండీగఢ్‌లోని మహారాజా యద్వీందర్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రోజున జరిగిన గుజరాత్‌ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో గుజరాత్దే పైచేయిగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్‌ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి ఆలౌటైంది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్‌(35), బ్రార్‌(29), కరన్‌(20) ఫర్వాలేదనిపించారు. రొస్సోవ్‌(9), జితేశ్‌(13), లివింగ్‌స్టన్‌(6), శశాంక్‌(8), అశుతోష్‌(3), భాటియా(13), రబాడ(1*) ఫెయిల్ అయ్యారు.

పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు గుజరాత్ కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఓపెనర్గా వచ్చిన శుభ్మన్ గిల్ 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 31 పరుగులతో దూసుకెళ్తున్న సమయంలో సామ్ కరణ్ చేతికి చిక్కాడు. దీంతో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కాస్త జాగ్రత్తగా ఆడాడు. కానీ జితేశ్ శర్మ అతడ్ని పెవిలియన్ బాట పట్టించగా.. ఆ తర్వాత వచ్చిన రాహుల్ తెవాటియా రాణించాడు. మొత్తానికి గుజరాత్ మూడు వికెట్ల తేడాతో 146 పరుగులు చేసి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news