పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం పిఠాపురం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా తన ఆస్తులకు సంబంధించి ఎన్నికల అఫిడవిట్‌ను ఎన్నికల అధికారికి అందజేశారు. అయితే పవన ఎన్నికల అఫిడవిట్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన ఆరోపణలు చేశారు.
అఫిడవిట్‌లో పవన్ కల్యాణ్ అన్నీ అబద్ధాలే చెప్పారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ అఫిడవిట్‌ను తనిఖీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. అఫిడవిట్‌లో చూపిన పవన్ ఆస్తులు, లావాదేవాల్లో లాజిక్ లేదని విమర్శించారు. చంద్రబాబుకు జనసేనను హోల్ సేల్‌గా అమ్మేశారని పోతిన మహేశ్ ఆరోపించారు. 2 చిత్రాలతో పవన్ రూ. 90 కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. ఆ డబ్బులు సినిమా సంపాదనతో వచ్చాయా..? లేక పొలిటికల్ ప్యాకేజీతో వచ్చాయా అని పోతిన మహేశ్ ఎద్దేవా చేశారు.