త్వరలోనే ఓటీటీలోకి రాశీ ఖన్నా ‘యోధ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

-

బాలీవుడ్‌ స్టార్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యోధ’. రాశీ ఖన్నా, దిశా పఠానీ హీరోయిన్లుగా నటించారు.  ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) ఇది అందుబాటులోకి రాగా..  మే 10 తర్వాత ఉచితంగా చూడొచ్చు.

క‌థేంటంటే: త‌న తండ్రి సురేంద్ర క‌టియాల్ (రోనిత్ రాయ్‌) స్ఫూర్తితో యోధా టాస్క్‌ఫోర్స్‌లో క‌మాండోగా చేర‌తాడు అరుణ్ క‌టియాల్ (సిద్ధార్థ్ మ‌ల్హోత్రా). దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఆప‌రేష‌న్స్‌లో పాల్గొన‌డం అతడి శైలి. ఆ క్ర‌మంలో కొన్నిసార్లు నిబంధ‌న‌ల్ని కూడా అతిక్ర‌మిస్తుంటాడు. ఆయ‌న భార్య ప్రియంవ‌ద క‌టియాల్ (రాశీఖ‌న్నా) కేంద్ర ప్ర‌భుత్వంలో ఉన్నతోద్యోగి. అరుణ్ చేప‌ట్టిన ఓ ఆప‌రేష‌న్ ఫెయిల్ కావ‌డంతో ప్రముఖ శాస్త్ర‌వేత్త అయిన అనుజ్ నాయ‌ర్ ప్ర‌యాణిస్తున్న విమానం హైజాక్‌కు గురికావ‌డంతో, ఉగ్ర‌వాదుల చేతుల్లో ఆయ‌న దారుణ హ‌త్య‌కు గుర‌వుతాడు. అదంతా స‌మ‌న్వ‌యలోపంతో జ‌రిగింద‌ని, అరుణ్‌ త‌న వాద‌న‌ వినిపిస్తాడు. ఆ ఆపరేషన్‌ ప్రభావం అరుణ్‌, ప్రియంవ‌ద వైవాహిక జీవితంపై పడుతుంది. ఆ సంఘ‌ట‌న త‌ర్వాత యోధ టాస్క్‌ఫోర్స్ భ‌విత‌వ్యమే ప్ర‌శ్నార్థ‌కం అవుతుంది. ఆ తర్వాత ఉగ్రవాదుల కుట్ర‌ల‌ను అతడు ఎలా తిప్పికొట్టాడ‌నేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news