జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా దుబాయ్ శీను ?

-

జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థిగా దుబాయ్ శీను ? ఏంటి అనుకుంటున్నారా ? ఈ దుబాయ్ శ్రీను.. అక్కడ చేసిన పనేమిటి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ వ్యవహారాలపై సందిగ్ధత నెలకొంది. టీటైమ్ అధినేత అయిన శ్రీనివాస్ ఇంజినీర్ అని ఆయన, పవన్ గొప్పలు అని వైసీపీ ఫైర్‌ అవుతోంది.

Janasena Kakinada MP candidate Dubai Sheenu

దుబాయ్, లండన్ లో జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పెద్ద ఉద్యోగాలు చేసినట్లు జనసేన చెబుతోంది. అఫిడవిట్లో ఇంటర్మీడియట్ అని చూపడంతో జనసేన శ్రేణులు కూడా షాక్‌ అవుతున్నారట. దీంతో సోషల్ మీడియాలోనూ ఆయనపై సంచలన పోస్టులు తెరపైకి వస్తున్నాయి.
శ్రీనివాస్ పై దుబాయ్ లో బెట్టింగ్ కేసు ఉన్నట్లు పోస్టులు పెడుతున్నారు కొంత మంది.

దుబాయ్ పోలీసులకు టోకరా వేసి పారిపోయి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినట్లు ప్రచారం చేస్తున్నారు. ఆయనకు రెండు పాన్ కార్డులున్నాయంటున్నారు జనసేన నేతలు. అఫిడవిట్లో ఒకటే పాన్ కార్డును చూపారు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్. దీంతో అసలు జనసేన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ పోటీకి అర్హుడేనా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయ నాయకులు.

Read more RELATED
Recommended to you

Latest news