తెలంగాణ-ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను చేసే ప్రమాదముంది – వినోద్‌ కుమార్‌

-

తెలంగాణ-ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను చేసే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో కార్నర్ మీటింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు చాలా ప్రాముఖ్యత కూడుకున్నది ఆశమాశి ఎన్నికలు కాదు….ఆనాడు చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్లమెంటులో 17 సీట్లతో తెలంగాణ బిల్లు ఎలా పెడతారని ఎద్దేవా చేశారన్నారు.

దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ నాయకత్వంలో సాధించామని తెలిపారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసే ప్రమాదముందని… గోదావరి జలాలను తెలంగాణ వాటా కోసం ఆనాడు కేంద్రమంత్రితో పోరాటం చేసి సాధించుకుందామని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాకు 1000 కోట్లతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాము…కరీంనగర్ నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, హైదరాబాద్, గజ్వేల్ వరంగల్ లాంటి ప్రాంతాలకు ఫోర్ వే లైన్లను తీసుకువచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదా అని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news