TDP-Janasena-bjp: చంద్రబాబు మేనిఫెస్టో ఇవాళే.. ఎన్ని హామీలిస్తారో?

-

TDP-Janasena-bjp: ఇవాళ టీడీపీ – బీజేపీ – జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కానుంది. ఇవాళ 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదల కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేయననున్నారు. 2023 రాజమండ్రి మహానాడులో సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించింది టీడీపీ. ఆ తరువాత కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి మూడు పార్టీలు.

Joint manifesto of NDA will be released tomorrow

మూడు పార్టీలకు ప్రజలు, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘ కసరత్తు చేసిన మూడు పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ వేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్ తో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అధిక పన్నులు, పన్నుల బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ది అనే కాన్సెప్ట్ తో మేనిఫెస్టో రూపొందించనున్నారు. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని.. సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామంటున్నది కూటమి. వచ్చే 5 ఏళ్లలో చేసే డవలప్మెంట్ పై స్పష్టమైన రోడ్ మ్యాప్ తో మేనిఫెస్టో ఉంటుందంటోంది కూటమి.

Read more RELATED
Recommended to you

Latest news