ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే t 20 ప్రపంచకప్ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు.ఇదిలా ఉంటే…టీ20 వరల్డ్ కప్ జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. జట్టు ఎంపికపై సెలెక్ట్ అజిత్ అగర్కర్ స్పందించారు.
వరల్డ్ కప్ కు KL రాహుల్ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ‘రాహుల్ ఐపీఎల్ లో ఓపెనింగ్ చేస్తున్నాడు. కానీ మాకు మిడిలార్డర్ బ్యాటర్లు కావాలి. అందుకు పంత్, శాంసన్ సరైన ఎంపికని భావించాం అని తెలిపారు. శాంసన్ ఏ ప్లేస్లో అయినా రాణించగలడు. జట్టుకు ఎవరు అవసరమనేదే చూశాం. ఎవరు బెటర్ అని కాదు’ అని తెలిపారు. కాగా ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యులు గల స్క్వాడ్లో రాహుల్కు చోటు దక్కకపోవడం గమనార్హం.కాగా, ప్రపంచకప్ జట్టులో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను సెలెక్ట్ చేసింది బీసీసీఐ.