ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించిన రాజ్ నాథ్ సింగ్

-

అనేక ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక గౌరవం లభిస్తోందని, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.గురువారం బీహార్‌లోని సుపాల్, సరన్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ హిందూ-ముస్లిం విభజనను సృష్టిస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఆర్జేడీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మైనారిటీ వర్గాలను ఆయన కోరారు.

ప్రతిపక్ష పార్టీలు మీ ముఖంపై ఇసుక జల్లి ఓట్లను పొందాలని భావిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అరబ్ ప్రపంచంలోని కనీసం 5 ఇస్లామిక్ దేశాల్లో ప్రధాని మోడీకి అత్యున్నత గౌరవం లభించింది.అయినా ప్రతిపక్షాలు తమపై అభియోగాలు మోపుతున్నాయని ‘ మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదని ,వెనుకబడిన తరగతుల కోటాల కోసం ఉన్న నిబంధనే ముస్లిం జానాభాల్లో వెనుకబడిన వర్గాల వారు అదే పరిధిలోకి వస్తారన్నారు. 400కి పైగా లోక్‌సభ స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ముందుకెళ్తోందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news