ఈసారి గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుంది : రేవంత్ రెడ్డి

-

రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకొని అక్రమంగా ఫామ్‌హౌజ్‌లు కట్టుకున్నోళ్లు కావాలా? ప్రజలకు మంచి చేసేవాళ్లు కావాలో నిర్ణయించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.గురువారం సాయంత్రం నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక్కడ పోటీ చేయకుండా పోలీసుల చేత కేసులు పెట్టించే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. వెంకట్రామిరెడ్డి నగదు చూసి టికెట్ ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కలెక్టర్‌గా ఉండ వెంకట్రామి రెడ్డి వందల ఎకరాలు కొల్ల గొట్టారని ధ్వజమెత్తారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో.. కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు చెందిన వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు. మెదక్‌ బీఆర్ఎస్‌లో అభ్యర్థులే లేరా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో మీటింగ్ పెడితే ఎవరూ రారేమోనని మా నేతలు అన్నారు.. కానీ, ఈ జనాలను చూస్తే సిద్దిపేట గడీలు బద్దలు అవడం ఖాయంగా కనిపిస్తోందని అన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news