పార్లమెంట్ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే ఎండ వేడమికి ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న పలువురు సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు. మరోవైపు ఎన్నికల విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ముగ్గురు అధికారులు మృతి చెందినట్లు తెలిసింది. కర్ణాటకలో ఇద్దరు పోలింగ్ అధికారులు గోవిందప్ప సిద్ధపుర(48), ఆనంద్ తెలంగ్(32) పోలింగ్ విధులు నిర్వహిస్తూ మరణించారు. గోవిందప్ప ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆనంద్ బీదర్ జిల్లాలోని కుదుంబల్లో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ హార్ట్ ఎటాక్ వల్ల మృతిచెందారని సమాచారం.
మరోవైపు బిహార్లోని సుపాల్ పోలింగ్లో బూత్లో ప్రిసైడింగ్ అధికారు గుండెపోటుతో మృతి చెందారని అధికారులు తెలిపారు. ఆయనను శైలేంద్రకుమార్గా గుర్తించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయణ్ను హీహెచ్సీకి తరలించగా చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి వచ్చారు. పోస్టుమార్టంలో ఆయనకు షుగర్ ఉన్నట్లు తేలింది’ అని ఓ వైద్యుడు తెలిపారు.