ఆ అంశంపై కెసీఆర్‌కు న‌మ్మ‌కం….లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేనా

-

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో అస‌లు రేసులో లేని భార‌త రాష్ట్ర స‌మితి ఇప్పుడు ఫుల్ యాక్టివ్ మోడ్‌లోకి వ‌చ్చేసింది.ఈ ఎన్నిక‌ల్లో అంచనాలు తలకిందులు చేసేలా క‌నిపిస్తున్నారు కెసీఆర్. అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతున్న‌ట్లు తెలుస్తోంది.కేసీఆర్ చేప‌ట్టిన బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమేనని విశ్లేషణలు వ్యక్తం అయ్యాయి. కానీ , కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోందిప్పుడు. రైతుబంధు, కరెంట్ కోతలు, ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ జనాలను బీఆర్ఎస్ వైపు ఆకర్షితుల్ని చేస్తున్నారు కెసీఆర్‌.ఇప్పటికే కొన్ని జిల్లాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ ఈ అంశాన్ని పలు చోట్ల హైలెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే కొత్త జిల్లాలు రద్దు అవుతాయంటున్నారు.

మొన్నామ‌ధ్య ఓ స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల‌ను త‌గ్గించ‌బోతున్నామ‌ని సెల‌విచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌పై కెసీఆర్ ప్ర‌ధానంగా ఫోక‌స్ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప‌రిపాల‌న సౌల‌భ్యం పెరిగింద‌ని చెప్తూ రేవంత్‌కి మ‌ళ్ళీ పాత‌రోజుల్లోకి తీసుకెళ్ళేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కెసీఆర్ ప్ర‌ధానంగా ఆరోపిస్తున్నారు. ఇది ప్ర‌జ‌లను ఆలోచ‌న‌లో ప‌డేస్తోంది.కేసీఆర్ బస్సు యాత్రతో జనాల ఆలోచనలో మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పలు లోక్ సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండగా ఎప్పటికప్పడు చేస్తోన్న సర్వేలో తాజాగా బీఆర్ఎస్ మెరుగైన స్థానంలోకి వచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ – బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేయగా బీఆర్ఎస్ అనూహ్యంగా రేసులోకి వచ్చేసింది. దీంతో హస్తం పార్టీలో అలజడి మొదలైంది. నిజామాబాద్ లో ప్రధానంగా బీజేపీ – కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అంతా అనుకున్నా… అందరి అంచనాలను తలకిందులు చేసేలా బీఆర్ఎస్ పోటీలోకి వచ్చేసింది.రోడ్ షో సక్సెస్ కావడంతో నిజామాబాద్ లో బీఆర్ఎస్ టాప్ లోకి వెళ్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. అసలు ఆశలు లేని స్థితి నుంచి లక్ష్యానికి చేరువగా రావడంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.

తాజాగా రైతు భరోసా నిధుల విడుదల తమ పోరాట ఫలమేనని బీఆర్ఎస్ వాదిస్తోంది. రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు.బీఆర్ఎస్ కు మొదటి నుంచి అండగా నిలిచింది ప్రధానంగా రైతులే. లోక్ సభ ఎన్నికల్లో వారిపై బీఆర్ఎస్ భారీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులను ఆదుకునే దిక్కు లేదని ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా నిధులను సర్కార్ విడుదల చేయడంతో బీఆర్ఎస్ దీనిని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ , బీజేపీలను తనదైన శైలిలో ఎదుర్కొంటూ ప్రతీ అంశాన్ని బీఆర్ఎస్ కు అనుకూలంగా మార్చే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news