ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. మంగళవారం సాయంత్రం పూట నగరానికి చేరుకున్న మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన ప్రధానమంత్రి మోదీని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబసభ్యులు కలిశారు. పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
పీవీ కుటుంబసభ్యులతో భేటీ అయిన చిత్రాన్ని మోదీ సామాజిక మాధ్యమం X లో పోస్టు చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయలు తదతర అంశాలపై వారితో చర్చించినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో మన దేశం సాధిస్తున్న పురోగతిపై పీవీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె, భారాస ఎమ్మెల్సీ వాణీదేవి, అల్లుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.ఆర్.నందన్, మనవడు, బీజేపీ నాయకుడు ఎన్.వి.సుభాష్ తదితరులు ఉన్నారు. ఇక ఈరోజు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండనున్నారు. వేములవాడ, వరంగల్ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.
హైదరాబాద్ చేరుకున్నాక మన మాజీ ప్రధాని, పండితుడు, రాజకీయ దురంధరుడు, శ్రీ పి వి నరసింహా రావు గారి కుటుంబ సభ్యులతో సమావేశం అద్భుతంగా జరిగింది. శ్రీ నరసింహా రావు గారికి భారత రత్న ప్రకటించినందుకు గాను వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియ జేశారు . మా సమావేశం లో అనేక విషయాలను… pic.twitter.com/ChIPW5ri9w
— Narendra Modi (@narendramodi) May 7, 2024