తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులకు కొత్త కష్టాలు వచ్చాయి. తెలంగాణలోని ఏ మూలకు వెళ్లిన అసలు లైట్ బీర్లు దొరకడం లేదు. దీంతో మందుబాబు అష్ట కష్టాలు పడుతున్నారు. కెసిఆర్ పాలనలో మందుబాబులకు న్యాయం జరిగేదని… కానీ రేవంత్ రెడ్డి పాలనలో… న్యాయం దేవుడికి ఎరుక… అసలు లైట్ బీర్లే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైట్ బీర్లు లేకపోతే చచ్చిపోతామంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాలేశ్వరం నీళ్లు రేవంత్ రెడ్డి వాడుకోకపోవడంతో… అన్ని బోర్లు ఎండిపోయాయి. ప్రాజెక్టులు నెర్రలు బారాయి.
ఈ తరుణంలో బీర్ల ఫ్యాక్టరీలలో కూడా బోర్లు ఎండిపోయాయి అంట. అసలు బీర్లు ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు కూడా ఉండటం లేదట. ఈ తరుణంలోనే లైట్ బీర్లకు కొరత వచ్చిందని తెలుస్తోంది. అయితే…మహబూబాబాద్ లో వైన్స్ షాప్ ల ముందు బీర్ల కోసం క్యూ లైన్లు షాపు తీయముందుకే భారులు తీరుతున్నారు మందుబాబులు. బిర్ల ప్రొడక్షన్ లేకపోవడం వల్లనే బీర్లు రావటం లేదంటున్నారు షాపు యజమానులు. అటు పల్లెటూర్లలో ఒక్కో బీరు ధర 300 లో పైనే డబ్బులు ఎక్కువ ఇచ్చిన బీర్లు దొరకడం లేదు.