ఎన్నికల వేల మత్తు దందాపై నిఘా.. 4 నెలల్లో రూ.39.15 కోట్ల సారా స్వాధీనం

-

లోక్సభ ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతోంది. ఈ నేపథ్యంలో మత్తు దందాపై తెలంగాణ ఆబ్కారీ శాఖ పటిష్ఠ నిఘా పెట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు తీవ్రం చేసింది. నాలుగు నెలలుగా అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.39.15 కోట్ల విలువైన సారా, దాని తయారీ పదార్థాలతోపాటు రూ.7.2 కోట్ల విలువైన గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. వీటన్నింటిని సీజ్ చేసినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వి.బి.కమలాసన్‌రెడ్డి తెలిపారు.

ఇందులో ఒక్క ఏప్రిల్‌లోనే రూ.33.5 కోట్ల విలువైన సరకును పట్టుకున్నట్లు చెప్పారు. 4 నెలల్లో మొత్తం 9,145 కేసుల్లో 4,010 మందిని నిందితులుగా గుర్తించినట్లు వివరించారు. ఎన్నికల నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా తయారవుతున్న సారా స్థావరాలపై 350 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా విస్తృతం చేసినట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు. గత 4 నెలల్లో రూ.8.27 కోట్ల విలువైన సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతోపాటు 593 వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news