ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. మూకుమ్మడి సెలవులు పెట్టిన 25 మంది క్రూ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎయిర్ ఇండియా. సంస్థ సర్వీస్ రూల్స్ ఉల్లంఘించిన కారణంగా తక్షణం వారిని తొలగిస్తున్నట్టు పేర్కొంది ఎయిర్ ఇండియా.
సరైన కారణం లేకపోయినా కావాలనే సెలవు పెట్టారని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారని తెలిపింది. మరిన్ని తొలగింపులు ఉంటాయన్న ఎయిర్ ఇండియా…మూకుమ్మడి సెలవులు పెట్టిన 25 మంది క్రూ సిబ్బందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. ఏఐఎక్స్ కనెక్ట్ సంస్థతో విలీనం అనే కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తున్నారు సిబ్బంది. అందుకే మూకుమ్మడిగా సెలవులు పెట్టారు ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులు. సెలవులు పెట్టి నిరసనలు తెలుపుతున్నారు.