నాలుగో విడత పోలింగ్‌కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. 2 నెలలుగా ప్రచారంలో హోరెత్తించిన మైకులు, DJలు, నేతల గళాలు మూగబోయాయి. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో సా.4 గంటలకే బంద్ కాగా.. మిగతా చోట్ల ఈ సా.6 గంటలకు ప్రచారం ముగిసింది. ఇన్నాళ్లూ ఇంటింటికీ తిరిగి అభ్యర్థులు హామీల వర్షం కురిపించగా.. మే 13న జరిగే ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఐవీఆర్ఎస్ కాల్స్,బల్క్ మెసేజ్‌లు, ఐవీఆర్ఎస్ సర్వేలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు అన్నీ బంద్ అయ్యాయి. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు మాత్రం అనుమతి ఉంటుంది.జూన్ 4న ఓటర్ల నాడి ఏంటన్నది ఫలితాల్లో తేలనుంది.