రేపే నాలుగో విడత పోలింగ్.. బరిలో నిలిచిన ప్రముఖులు ఎవరంటే?

-

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ రేపు (మే 13వ తేదీ 2024) జరగనుంది. ఈ విడతలో పలువురు కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు బరిలో నిలిచారు. మరోసారి గెలిచి తమ సత్తాను చాటేందుకు కేంద్ర మంత్రులు ప్రయత్నిస్తుండగా, సిల్వర్ స్క్రీన్పైనే కాదు రాజకీయంలోనూ తాము స్టార్లమేనని నిరూపించుకోవాలని సినీ ప్రముఖులు తహతహలాడుతున్నారు. నాలుగో విడతలో ప్రముఖులు పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాలేంటో చూద్దాం.

బిహార్‌లో బెగూసరాయ్‌ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బంగాల్లోని బహరంపుర్‌ నియోజకవర్గంలో అయిదుసార్లు గెలుపొందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సిటింగ్‌ ఎంపీ అధీర్‌రంజన్‌ చౌధరీ మరోసారి పోటీలో ఉన్నారు. ఆయనపై భారత జట్టు మాజీ క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ బరిలో దింపింది. ఝార్ఖండ్‌లోని ఖూంటీ స్థానంలో సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్జున్‌ ముండా బీజేపీ అభ్యర్థిగా మరోసారి అక్కడే పోటీకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా ప్రస్తుతం బంగాల్లోని అసన్సోల్‌ స్థానంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం కన్నౌజ్‌ నుంచి బరిలో నిలిచారు. బిహార్‌లోని ఉజియార్‌పుర్‌ నుంచి కేంద్ర మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఆర్జేడీ తరఫున సీనియర్‌ నేత అలోక్‌ మెహతా మరోసారి బరిలోకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news