సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా తన సిటింగ్ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం విడదీయలేనిదని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాంతంలో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియోను షేర్ చేశారు.
వరుసగా మూడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా వారణాసి బరిలో దిగుతున్న మోదీ మొదట గంగా తీరంలోని దశాశ్వమేథ్ ఘాట్ వద్ద మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగానదికి హారతి సమర్పించారు. అనంతరం కాశీవిశ్వనాథుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు మోదీ బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
अपनी काशी से मेरा रिश्ता अद्भुत है, अभिन्न है और अप्रतिम है… बस यही कह सकता हूं कि इसे शब्दों में व्यक्त नहीं किया जा सकता! pic.twitter.com/yciriVnWV9
— Narendra Modi (@narendramodi) May 14, 2024