విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్.. రెండేళ్ల యూకే గ్రాడ్యుయేట్ వీసా కొనసాగింపు!

-

యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. విదేశీ విద్యార్థులకు ఇచ్చే రెండేళ్ల గ్రాడ్యుయేట్ వీసాలను అలాగే కొనసాగించాలని బ్రిటన్ ప్రభుత్వం నియమించిన రివ్యూ కమిటీ సూచించింది. భారత్ సహా పలు దేశాల విద్యార్థులు చెల్లించే రుసుముల వల్ల బ్రిటన్ యూనివర్సిటీలకు బాగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయని తెలిపింది. దీని వల్ల ఆయా విద్యాసంస్థల లోటు బడ్జెట్ సమస్య తీరుతోందని మైగ్రోషన్ అడ్వైజరీ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

బ్రిటన్ యూనివర్సిటీల్లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు జారీ చేసే గ్రాడ్యుయేట్ వీసాల వల్ల కలిగే లాభనష్టాల గురించి అధ్యయనం చేయడానికి, ప్రభుత్వం ఈ రివ్యూ కమిటీని నియమించింది. బ్రిటన్ అంతర్గత వ్యవహార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ అధ్యయనంలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు, వారి నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం కోసం రెండేళ్ల వ్యవధితో మంజూరు చేసే వీసాలను అలాగే కొనసాగించాలని పేర్కొంది. ప్రస్తుత గ్రాడ్యుయేట్ వీసా విధానాన్ని కొనసాగిస్తూనే, బ్రిటన్‌ విద్యావిధానం, విద్య నాణ్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎంఏసీ ఛైర్‌ ప్రొఫెసర్‌ బ్రియాన్‌ బెల్‌ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news