అమ్మకానికి హైదరాబాద్ మెట్రో వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో… రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత… ఫ్రీ బస్సు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రీ బస్సు నేపథ్యంలో చాలామంది మహిళలు ఇందులోనే వెళుతున్నారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు. ఇక ఈ ఫ్రీ బస్సు కారణంగా తీవ్రంగా నష్టపోయామని.. అసలు ప్రయాణికులు ఎవరు మెట్రో రైల్లో వెళ్లడం లేదని L& T కంపెనీ వెల్లడిస్తోంది.
హైదరాబాద్ మెట్రో నుండి వైదొలగనున్న ఎల్&టీ… ఫ్రీ బస్సు పథకంతో మెట్రోలో ప్రయాణికులు తగ్గడంతో మెట్రో నుండి తప్పుకోవాలని అనుకుంటున్నారు. అమ్మకానికి హైదరాబాద్ మెట్రో వచ్చినట్లు వచ్చిన వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు? ఫైర్ అయ్యారట.ఉచిత బస్ స్కీంతో హైదరాబాద్ మెట్రో లాస్ అవుతుందని L&T అమ్ముకుంటాం అన్న కామెంట్స్ పై స్పందించడానికి ఇష్టపడని సీఎం రేవంత్… అమ్ముకుంటే అమ్ముకోమను! ఎవరిని బెదిరిస్తున్నారు? రియాక్షన్ ఇచ్చారట.