అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఇదే..!

-

ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలను వెల్లడించారు. దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలిపారు సీఈవో ముఖేష్ కుమార్ మీనా. తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతంగా నమోదు అయింది.

3500ల కేంద్రాల్లో అర్థరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. పార్లమెంట్ కి 3,33,0,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. మరోవైపు ఈవీఎంలు ధ్వంసం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఆయన తెలిపారు. సీసీ కెమెరాల్లో అంతా రికార్డు అయిందని.. దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి.. జైలుకు పంపించామని తెలిపారు. తాడిపత్రి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేటలో ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 715 పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు ముఖేష్ కుమార్. నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news