సిరిసిల్లలో నకిలీ మందులు కలకలం రేపాయి. కిడ్నీలో రాళ్లు తొలగిస్తామంటూ మోసాలు చేస్తున్నారు. అధిక బరువుని తగ్గిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నాయి పలు సంస్థలు. కిడ్నీలో రాళ్లు తొలగిస్తామంటూ నకిలీ మందులు విక్రయాలు జరుపుతున్నాయి కొన్ని కంపెనీలు.
అయితే… ఈ నకిలీ మందుల విక్రయాల పై కొరడా జులిపిస్తుంది డ్రగ్ కంట్రోల్ బ్యూరో. సిరిసిల్లలో నకిలీ మందులు అమ్ముతున్న మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ సోదాలు నిర్వహించింది. కిడ్నీలో రాళ్లు బరువును తగ్గిస్తామంటూ మందులు విక్రయిస్తున్నాయి మెడికల్ షాపులు. తప్పుడు ప్రచారాలతో నకిలీ మందులు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నాయి మెడికల్ షాపులు. అయితే…ఈ మెడికల్ షాపులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.