ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుంది : వైస్ జగన్ సంచలనం

-

cm jagan in i pac office: ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విజయవాడలోని ఐ ప్యాక్ ఆఫీసుకు జగన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తున్నామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్.

cm jagan in i pac office

వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.

Read more RELATED
Recommended to you

Latest news