టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానంలో చోటుచేసుకుంది.
దిల్లీ నుంచి వడోదరకు వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానంలోని వాష్‌రూంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులను కిందకు దించేశారు. సీఐఎస్ఎఫ్తోపాటు దిల్లీ పోలీసులకు సమాచారం అందించగా.. భద్రతా సిబ్బంది విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశామని, భద్రతా సంస్థలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాయని ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు యత్నించామని, వారికి వసతి సౌకర్యం కల్పించామని తెలిపింది.