అప్పుడు దోస్తులు ఇప్పుడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా ఎమ్మెల్సీ ఉపఎన్నిక

-

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఏంటంటే.. ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు ఒకప్పుడు స్నేహితులు. ఇప్పుడేమో ప్రత్యర్థులుగా మారి ఉపఎన్నిక బరిలో ఒకరిపై మరొకరు పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్‌-తీన్మార్‌ మల్లన్న, బీజేపీ-గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్-ఏనుగుల రాకేశ్‌రెడ్డిలు గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేసిన వారే. జర్నలిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన తీన్మార్‌ మల్లన్న 2021లోనే బీజేపీలో చేరారు. తిరిగి 2023లో కాంగ్రెస్‌ గూటికి చేరారు.  బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆ పార్టీలో అనేక పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ.. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి 2013లో బీజేపీలో చేరి బీజీవైఎంలో పదవులు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, భద్రాద్రి జిల్లా ఇన్‌ఛార్జిగా పని చేశారు. ఈ సంవత్సరం  బీఆర్ఎస్ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news