ఈ వారం థియేటర్‌లో అలరించే చిత్రాలివే

-

గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూసేద్దామా?

రాజుయాదవ్‌..  ‘జబర్దస్త్‌’తో తెలుగు వారికి ఎంతో దగ్గరైన గెటప్‌ శ్రీను కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

లవ్‌ మీ – ఇఫ్‌ యూ డేర్‌.. ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మించారు.  ఈ మూవీ మే 25న విడుదల కానుంది.

డర్టీ ఫెలో.. శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి నాయకానాయికలుగా ఆడారి మూర్తి సాయి తెరకెక్కించిన చిత్రం ఇది. సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా.. మ్యాడ్‌ మ్యాక్స్‌’. ఈ ఫ్రాంఛైజీలో వస్తున్న మరో చిత్రమిది. అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news