ఐదో విడత ఎన్నికలు​.. ఉదయం 9 గంటల వరకు 10.28% పోలింగ్

-

సార్వత్రిక సమరం ఐదో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు 10.28 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

వివిధ రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా ఉంది.. 

  • బిహార్‌ 8.86
  • జమ్ముకశ్మీర్ 7.63
  • ఝార్ఖండ్‌ 11.68
  • లద్దాఖ్‌ 10.51
  • మహారాష్ట్ర 6.33
  • ఒడిశా 6.87
  • ఉత్తర్‌ప్రదేశ్‌ 12.89
  • బంగాల్‌ 15.35

ఐదో విడత ఎన్నికల పోలింగ్ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా  హాకీ ఇండియా అధ్యక్షుడు, బీజేడీ నేత దిలీప్‌ టిర్కీ ఓటు వేశారు. మరోవైపు సినీ ప్రముఖులు షాహిద్​ కపూర్, జాన్వీ కపూర్‌, శ్రియా శరణ్ ముంబయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమేఠీ పోలింగ్ కేంద్రంలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ఓటు వేశారు. ముంబయిలో కేంద్రమంత్రి పీయూశ్ గోయల్, ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, హిమచల్​ప్రదేశ్​లోని హమీర్​పుర్​ పోలింగ్ బూత్​లో కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి ఓటు వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news